Advertisement

  • వ్యవసాయ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వసంతసుగుణ

వ్యవసాయ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వసంతసుగుణ

By: chandrasekar Wed, 29 July 2020 3:21 PM

వ్యవసాయ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వసంతసుగుణ


ప్రతి రైతు తప్పనిసరిగా పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని, లేకుంటే అమ్మే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్‌ సహాయ సంచాలకురాలు వసంతసుగుణ అన్నారు. నార్సింగి వ్యవసాయ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. పంటల వివరాల ఆన్‌లైన్‌లో నమోదు పక్రియను మంగళవారం పరిశీలించారు.

రామాయంపేట, నిజాంపేట మండలాల రైతులు పంటల వివరాలను ఈనెల 31వరకు సంబంధిత విస్తరణ అధికారులకు అందజేయాలని ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్‌ బాదె చంద్రం కోరారు. సొసైటీ డైరెక్టర్లు పంట వివరాలను ఇవ్వని రైతుల వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేయవలసిందిగా తెలుపాలన్నారు. అందుబాటులో లేని రైతులు తమ పట్టాదార్‌ పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్సు కాపీలను సంబంధిత వ్యవసాయ శాఖ రామాయంపేట కార్యాలయంలో ఈనెల 31 వరకు అందజేయాలన్నారు.

చైర్మన్‌ వెంట సీసీవో పుట్టి నర్సింహులు ఉన్నారు. మండలవ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతుల పొలాలను సందర్శించి పంట వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఏఈవో శ్రీలత రజాక్‌పల్లిలో రైతు వీరపట్నం రాజు వ్యవసాయ పొలాన్ని సందర్శించి పంట వివరాలను సేకరించారు.

Tags :
|

Advertisement