Advertisement

ఇకనుంచి ఇంటికే అమ్మవారి దివ్యప్రసాదం

By: Dimple Mon, 31 Aug 2020 00:11 AM

ఇకనుంచి ఇంటికే అమ్మవారి దివ్యప్రసాదం

పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయ ప్రసాదం ఇకపై భక్తుల ఇంటికే చేరనుంది. ఇందుకు అనుగుణంగా తపాలా శాఖతో ఒప్పందం కూడా చేసుకున్నారు. దేశం నలుమూలల నుంచి ప్రతి ఏటా లక్షలాది భక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆ పుణ్యక్షేత్రాన్ని మూసివేశారు.

లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం పలు నిబంధనలు విధిస్తూ ఆగస్టు 16న గుడిని తిరిగి తెరిచారు. ఈ నేపథ్యంలోనే ఆర్డర్‌ పెట్టుకుంటే స్పీడ్‌పోస్టు ద్వారా భక్తుల ఇంటికే ప్రసాదాన్ని చేరవేసేలా శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై భారత తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోర్డు తెలిపింది.

కరోనా సమయంలో ఆలయానికి రాలేకపోతున్న భక్తుల కోసం వారి ఇంటికే ప్రసాదాన్ని పంపించేలా సన్నాహాలు చేస్తున్నాం. దీనిపై తపాలా శాఖతో చర్చించాం’ అని ఆలయ బోర్డు తెలిపింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్లో గానీ, ఫోన్‌ చేసిగానీ ఆర్డర్‌ను బుక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

Tags :
|

Advertisement