Advertisement

  • శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా డిసెంబ‌రు 11న విడుదల

శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా డిసెంబ‌రు 11న విడుదల

By: chandrasekar Fri, 11 Dec 2020 5:38 PM

శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా డిసెంబ‌రు 11న విడుదల


దేశంలో వివిధ ప్రాంతాల నుండి శ్రీవారిని దర్శించుటకు భక్తులు తిరుమల వస్తుంటారు. ప్రస్తుతం కరోనా వల్ల కొన్ని నియమాలు పాటించబడుతున్నాయి. ఈ రోజు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయబడింది. భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఈ నెల డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అంటే రోజుకు దాదాపు 20 వేల టికెట్లు ను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబ‌రు 11న శుక్ర‌వారం ఉద‌యం 6.30 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు తమ దర్శన టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చును. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ అవకాశం ఇప్పుడు కల్పించడంతో భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారంలో శ్రీమహావిష్ణువును దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పవిత్ర రోజున ప్రముఖ వైష్ణవాలయాలలో ఉత్తరద్వారం నుంచి మాధవుడిని భక్తులు దర్శించుకుంటారు. ఈ దర్శనం ఎంతో గొప్పగా గుర్తించబడుతుంది. ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పర్వదినమని భక్తుల నమమ్మకం. వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరద్వార దర్శనం కోసం భక్తకోటి నిరీక్షించే సమయం శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజులపాటు ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. దీనికోసం భక్తులు అధికసంఖ్యలో స్వామి దర్శనానికి వెళుతుంటారు.

Tags :

Advertisement