Advertisement

  • తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

By: Sankar Fri, 25 Dec 2020 08:17 AM

తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై రామయ్య, గజ వాహనంపై సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనమిచ్చారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నది. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహస్వాముల మూలవిరాట్లకు మహాక్షీరాభిషేకం నిర్వహించారు.

కరోనా దృష్ట్యా పురవీధుల్లో స్వామివారి ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. రాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు...హైదరాబాద్‌లోని వనస్థలిపురం వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొన్నది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. బంజారాహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు.

Tags :

Advertisement