Advertisement

  • CNBG సెకండ్ ట్రయల్‌లో వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలు

CNBG సెకండ్ ట్రయల్‌లో వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలు

By: chandrasekar Sat, 20 June 2020 09:48 AM

CNBG సెకండ్ ట్రయల్‌లో వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలు


కరోనాపై సత్ఫలితాలు ఇస్తున్న చైనా వ్యాక్సిన్ భారీగా పెరుగుతున్న యాంటీబాడీస్ కరోనా వైరస్ విరుగుడుకి సంబంధించి ప్రపంచం నలుమూలల నుంచి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. చాలా సంస్థలు తమ వ్యక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.

తాజాగా చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (CNBG) మనుషులపై జరుగుతున్న ట్రయల్స్‌లో తమ వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని చెబుతోంది. మొత్తం మూడు ట్రయల్స్ చేపట్టబోతున్న ఈ కంపెనీ మొదటి ట్రయల్‌లో వ్యక్తులకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బలమైన యాంటీబాడీస్ ఏర్పడ్డాయని తెలిపింది. సెకండ్ ట్రయల్‌లో కూడా ఇలాగే జరిగితే వ్యాక్సిన్ తయారయ్యే అవకాశాలు ఉంటాయి.

వ్యాక్సిన్ ఇచ్చాక యాంటీబాడీస్ బాగా పెరిగినా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా కనిపించలేదని ఈ సంస్థ చెబుతోంది. నిజానికి CNBG ఒకే సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారుచేస్తోంది. ప్రస్తుత వ్యాక్సిన్‌ను ఏప్రిల్‌లో 1120 మందికి ఇచ్చింది. వాళ్లంతా 18 నుంచి 59 ఏళ్ల వాళ్లే. రెండో ట్రయల్ త్వరలోనే పూర్తి చేసి విదేశాల్లో భారీ ఎత్తున మూడో ట్రయల్ చేపడతామని తెలిపింది.

CNBG మొత్తం 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారుచేయాలనుకుంటోంది. ఇందుకోసం బీజింగ్, వుహాన్‌లో వ్యక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్ని రెడీ చేస్తోంది.

సోమవారం చైనాకి చెందిన సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ మంచి మాట చెప్పింది. తాము తయారుచేస్తున్న కరోనావాక్ అనే వ్యాక్సిన్ 90 శాతం మందికిపైగా న్యూజ్రలైజింగ్ యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసిందని తెలిపింది. తాము జరిపిన రెండో ట్రయల్స్‌లో ఈ ఫలితం కనిపించిందని వివరించింది.

చైనాలో మొత్తం ఐదు కంపెనీలు వ్యాక్సిన్లు తయారుచేస్తున్నాయి. వాటిలో సినోవాక్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే బ్రెజిల్‌లో ఫేజ్ త్రీ ట్రయల్ ప్రారంభిస్తామంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచంలో 10 ప్రయోగాత్మక వ్యాక్సిన్లు డిసెంబర్ నాటికి రెడీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 126 కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్కటి కూడా కరోనా వ్యాక్సిన్‌గా అనుమతి పొందలేదు

Tags :
|
|

Advertisement