Advertisement

ఇండియాలో వ్యాక్సిన్...

By: chandrasekar Fri, 11 Dec 2020 10:22 PM

ఇండియాలో వ్యాక్సిన్...


యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ముఖ్యత్వం ఇవ్వడంతో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇండియాలో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. మెడికల్ ఏజెన్సీలు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తున్నాయి.

భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూ​ఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసి) దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్‌డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇ‍మ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది.

Tags :
|
|

Advertisement