Advertisement

  • వారంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌...

వారంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌...

By: chandrasekar Tue, 27 Oct 2020 11:50 AM

వారంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌...


ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వాక్సిన్ కోసం ప్రజలు వేచి వున్నారు.

ఈ నేపధ్యంలో మరో వారంరోజుల్లో కరోనా మహమ్మారికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ రాబోతున్నట్టు లండన్‌లోని ఓ ప్రఖ్యాత హాస్పిటల్ పేర్కొంది.

నవంబర్‌ 2 (సోమవారం) నుంచి టీకా డోసులను పంపిణీ చేయడానికి బ్రిటన్‌ వైద్య సేవల యంత్రాంగం (ఎన్‌హెచ్‌ఎస్‌) ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపింది.

ఎన్‌హెచ్‌ఎస్‌ నుంచి తొలి విడుత వ్యాక్సిన్‌ డోసులు అందగానే, దేశంలోని వేలాదిమంది వైద్యులు, నర్సులకు టీకాలను వేయిస్తామన్నది. ఈ మేరకు ‘ది సన్‌' దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది.

Tags :

Advertisement