Advertisement

  • ఎన్నికల నియమావళి ఉల్లంఘన ..మంత్రికి మూడు నెలల జైలు శిక్ష

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ..మంత్రికి మూడు నెలల జైలు శిక్ష

By: Sankar Wed, 11 Nov 2020 9:50 PM

ఎన్నికల నియమావళి ఉల్లంఘన ..మంత్రికి మూడు నెలల జైలు శిక్ష


ఎన్నికలు జరిగే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదు. ఒకవేళ ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇలానే డెహ్రాడూన్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరక్ సింగ్ రావత్ 2012లో జరిగిన ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో రుద్రప్రయాగ్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో హరక్ సింగ్ రావత్ కు ఐపీసీ 143 కింద మూడు నెలల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

2012లో కాంగ్రెస్ పార్టీ తరువాత పోటీ చేసిన రావత్ ఆ తరువాత బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అయన బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. రుద్రప్రయాగ్ కోర్టు తీర్పు అనంతరం కోర్టు నుంచి అయన బెయిల్ తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement