Advertisement

  • నాకు కరోనా లేదు ..కూరగాయలు కొనుక్కోవచ్చు అని బోర్డు పెట్టిన కూరగాయల వ్యాపారి

నాకు కరోనా లేదు ..కూరగాయలు కొనుక్కోవచ్చు అని బోర్డు పెట్టిన కూరగాయల వ్యాపారి

By: Sankar Wed, 26 Aug 2020 1:00 PM

నాకు కరోనా లేదు ..కూరగాయలు కొనుక్కోవచ్చు అని బోర్డు పెట్టిన కూరగాయల వ్యాపారి


కరోనా కారణంగా ప్రజలు ఇంతకుముందు లాగ బయట ఎక్కడ పడితే అక్కడ తిరిగే పరిస్థితులు లేవు ..ఎక్కడ ఏది కొనాలన్నా కరోనా వస్తుందేమో అన్న భయంతో ప్రజలు ఉన్నారు ..దీనితో చిరు వ్యాపారుల వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి.పలువురు కూరగాయలు చేసే వ్యాపారులకు కూడా కరోనా సోకింది.

దీంతో కూరగాయాలు కొనాలన్న కూడా ప్రజలు భయపడే పరిస్థితి. దీంతో ఓ కరోనా వ్యాపారి కరోనా విషయంలో వినూత్నంగా ఆలోచించాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారి తనకు కరోనా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. తన వద్ద ఎవరైనా నిర్భయంగా కాయగూరలు కొనవచ్చన్నాడు.

ఆదిలాబాద్ జిల్లాలో పాత ఉట్నూరుకు చెందిన కూరగాయల దుకాణదారు డోలి శంకర్‌ మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. తనకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆ రిపోర్టుకు ఫ్రేమ్ కట్టించాడు. తన దుకాణంలో అందరికీ కనిపించేలా ఫ్రేమ్‌ కట్టి తగిలించాడు. ‘నాకు కరోనా లేదు.. నిర్భయంగా కూరగాయలు కొనవచ్చు’ అని వినియోగదారులకు భరోసా కల్పిస్తున్నాడు. దీంతో శంకర్ చేసిన ఈ వినూత్న ప్రయోగం మరికొందరు వ్యాపారులను ఆలోచనలో పడేసింది. అంతేకాదు.. ఇప్పుడు టౌన్‌లో శంకర్ ఓ హాట్ టాపిక్‌గా మారిపోయాడు.

Tags :
|
|
|
|

Advertisement