Advertisement

  • చైనా యొక్క పాపులర్ అప్స్ కు బదులుగా ఈ అప్స్ వాడండి...

చైనా యొక్క పాపులర్ అప్స్ కు బదులుగా ఈ అప్స్ వాడండి...

By: chandrasekar Tue, 30 June 2020 5:16 PM

చైనా యొక్క పాపులర్ అప్స్ కు బదులుగా ఈ అప్స్ వాడండి...


ఇండియా మరియు చైనా సరిహద్దు ఘర్షణల్లో 20 మంది జవాన్లు అమరులైన తర్వాత దేశంలో చైనాకు వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం, జూన్ 29 రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది.

చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించింది. వీటిలో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ సహా పలు యాప్‌లు ఉన్నాయి. కేంద్ర నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ యాప్‌లకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో చైనా యాప్‌లకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ యాప్స్‌ ద్వారా చేసే పనులనే ఏయే ఇతర యాప్స్‌ ద్వారా చక్కబెట్టుకోవచ్చు తదితర వివరాలు:

యూసీ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయం గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్...

మనం నిత్యం ఉపయోగించే బ్రౌజర్లు ద్వారా వార్తలు, అప్‌డేట్స్, ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం ఇలా ఏది కావాలన్నా ఇంటర్నెట్‌లో అప్పటికప్పుడు వెతుక్కొని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే చైనాకు చెందిన చాలా మొబైళ్లలో డిఫాల్ట్‌గా యూసీ బ్రౌజర్‌ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని తొలగించినా పెద్ద నష్టం ఏమీ లేదు. గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇవే సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. యూసీ బ్రౌజర్ ద్వారా విలువైన వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీడియో, ఫోటో ఫైల్ షేరింగ్ కు ప్రత్యామ్నాయం గా షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్‌ బై గూగుల్...

మొబైల్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే మరో యాప్ ‘షేర్ ఇట్’. ఇది కూడా చైనా యాపే కావడంతో కేంద్రం నిషేధించింది. దీనికి ప్రత్నామ్నాయంగా ‘షేర్‌ ఫైల్స్‌’, ‘ఫైల్స్‌ బై గూగుల్‌’ ఫైల్ షేరింగ్ యాప్‌లు ఉన్నాయి. వీని ద్వారా ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, యాప్స్‌ ఒకరి నుంచి మరొకరికి పంపుకోవచ్చు. షేర్‌ఇట్‌‌తో పాటు జెండర్‌ లాంటి యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా గూగుల్‌కు చెందిన ఈ యాప్స్‌ను వాడుకోవచ్చు.

టిక్‌టాక్ ప్రత్యామ్నాయం గా డబ్ స్మాష్, రొపొసొ, పెరిస్కోప్‌...

నటన కోరిక తీర్చడంలో ‘టిక్‌టాక్‌’ అప్ చిన్నా, పెద్దా అనే తేగా లేకుండా అందరూ ఇష్టపడి వాడుతున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పడు వీడియోలు చేస్తూ స్నేహితులతో పంచుకునే వెసులుబాటు ఉంది. చైనా యాప్ కావడంతో దీనిపైనా బ్యాన్ పడింది. టిక్‌టాక్‌తో పాటు విగో వీడియో, లైక్‌, హలో యాప్‌‌ల పైనా నిషేధం పడింది. అయితే టిక్‌టాక్ కంటే ముందు డబ్ స్మాష్ చాలా పాపులర్. ప్రస్తుతం ఇది లేటెస్ట్ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఇకపై డబ్ స్మాష్, రొపొసొ, పెరిస్కోప్‌ లాంటి యాప్‌లను ఉపయోగించవచ్చు.

Tags :
|

Advertisement