Advertisement

  • అమెరికా ఓట్ల లెక్కింపు: పేలుతున్న జోకులు, మీమ్స్...!

అమెరికా ఓట్ల లెక్కింపు: పేలుతున్న జోకులు, మీమ్స్...!

By: Anji Fri, 06 Nov 2020 11:22 PM

అమెరికా ఓట్ల లెక్కింపు: పేలుతున్న జోకులు, మీమ్స్...!

అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ఆ దేశ పౌరులతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. 50 రాష్ట్రాలకు గాను 45 రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చినా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చుంటారనేది తేలలేదు.

అధ్యక్ష పీఠాన్ని గెల్చుకోవడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఇప్పటికే 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంగా ఉన్నారు.

ట్రంప్ గెలవాలంటే మిగిలిన ఐదు రాష్ట్రాల్లో ఆయనకే ఆధిక్యం రావాల్సి ఉంది. కానీ, ఆ ఐదు రాష్ట్రాల్లో ఒక్క చోట విజయం సాధించిన జో బైడెన్.. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.

ఇలాంటి కీలక సమయంలో జార్జియా, నెవడా రాష్ట్రాల్లో ఫలితాలు తుది ఫలితాల ప్రకటనకు కీలకంగా మారాయి. కానీ, గంటల తరబడి ఎదురుచూస్తున్నా.. అక్కడి ఫలితాలు వెల్లడి కావడంలేదు. 98 శాతం లెక్కింపు పూర్తయినట్లు ప్రకటించి 12 గంటలు గడిచిన తర్వాత కూడా అదే పరిస్థితి.

ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ పెడుతున్నారు. తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తీరుపై పోస్టు చేసిన వీడియోలు, ఫోటోలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. కొన్ని మీమ్స్ పొట్ట చెక్కలు చేస్తున్నాయి. అలాంటి కొన్ని మీమ్స్‌ను కింది ట్వీట్లలో చూడవచ్చు.

Tags :
|
|
|

Advertisement