Advertisement

  • ఇండియా- చైనా సరిహద్దు వివాదం ..కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

ఇండియా- చైనా సరిహద్దు వివాదం ..కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

By: Sankar Fri, 26 June 2020 10:49 AM

ఇండియా- చైనా సరిహద్దు వివాదం ..కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా



ఇండియా చైనా మధ్య జరుగుతున్న సంఘర్షణలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది ..జర్మనీలో ఉన్న తమ సైన్యాన్ని వెన్నక్కి రప్పిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన ప్రకటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది..జర్మనీలో అమెరికా దళాలను తగ్గించాలనే నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నామని, ఎందుకంటే వాటిని ఇతర ప్రదేశాలకు తరలించాలని అన్నారు..

మేము చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోబోతున్నాం.. ఇది ఓ సవాల్‌గా భావిస్తున్నాం.. దీనిని పరిష్కరించడానికి మాకు వనరులు ఉన్నాయని నిర్ధారించుకోబోతున్నాం’ అని ఆయన అన్నారు.ఐరోపాలో తమ దళాలను తగ్గించడం వెనుక భారతదేశానికి చైనా నుంచి బెదిరింపులు, ఆగ్నేయాసియాలో పరిస్థితులు ప్రధాన కారణాలలో ఒకటని గురువారం జరిగిన బ్రస్సెల్స్ ఫోరమ్‌లో పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు

పొరుగుదేశాలపై చైనా బెదిరింపులకు పాల్పడుతోందని పాంపియో ప్రధానంగా ప్రస్తావించడం అమెరికా విధాన ప్రకటన, భద్రత విధానాలను సూచిస్తుంది. గాల్వన్ లోయ ఘర్షణ, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కార్యకలాపాలు, దాని దోపిడీ ఆర్థిక విధానాల గురించి పాంపియో మాట్లాడారు. చైనా నుంచి ఎదురువుతున్న సవాళ్లపై అమెరికా, ఐరోపా సమాఖ్య చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. ట్రాన్స్-అట్లాంటిక్ కూటమికి చైనా నుంచి ఎదుర్కొంటున్న ముప్పుపై సాధారణ అవగాహన ఇది తోడ్పడుతుందన్నారు.


Tags :
|
|
|
|
|

Advertisement