Advertisement

  • చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా...టిక్‍‌టాక్, వీచాట్‌పై నిషేధం

చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా...టిక్‍‌టాక్, వీచాట్‌పై నిషేధం

By: chandrasekar Fri, 18 Sept 2020 8:50 PM

చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా...టిక్‍‌టాక్, వీచాట్‌పై నిషేధం


భారత్ తర్వాత చైనాకు గట్టి షాకిచ్చింది అమెరికా. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధిస్తున్నట్లు యూఎస్ ప్రకటించింది. వచ్చే ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం తన ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ విల్‌బర్ రోస్ ఆరోపించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో భద్రతారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

తాజా నిర్ణయానికి సంబంధించిన మిగితా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని యూఎప్ డిపార్ట్ మెంట్ ఆఫ్ కామన్స్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిన నాటి నుంచీ చైనాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ దేశం చేసిన తప్పునకు ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చైనాపై వాణిజ్య పరమైన ఆంక్షలను విధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. చైనాకు సంబంధించిన యాప్‌లపై నిషేధం విధిస్తామంటూ గతంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ టిక్‌టాక్ తోపాటు వీచాట్ యాప్‌లపై నిషేధం విధించింది.

Tags :
|
|
|

Advertisement