Advertisement

  • అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్..ఓటింగ్ కు భారీగా తరలివచ్చిన జనం

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్..ఓటింగ్ కు భారీగా తరలివచ్చిన జనం

By: Sankar Wed, 04 Nov 2020 07:53 AM

అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్..ఓటింగ్ కు భారీగా తరలివచ్చిన జనం


అమెరికా చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు జనం భారీగా తరలివచ్చారు.

కొవిడ్‌-19 భయం వెన్నాడుతున్నా ఓపిగ్గా గంటల కొద్దీ పోలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా పలు రాష్ట్రాల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. అటు ట్రంప్, ఇటు బైడెన్ విజయంపై ధీమాగా ఉన్నారు.

ఓటింగ్‌కు ముందు రోజే దాదాపు 10 కోట్ల మంది మెయిల్‌ బ్యాలెట్ల రూపంలో ఓటేశారు. మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్ట్రోరల్ ఓట్లుండగా అత్యధికం ఓట్లు గెలుచుకున్నవారికే అధ్యక్ష పీఠం దక్కనుంది. ఎక్కువ ఎలక్టోరల్ ఓట్లున్న రాష్ట్రాలు విజయంలో కీలకం పాత్ర పోషించనున్నాయి. అత్యధికంగా కాలిఫోర్నియాలో 55, టెక్సాస్ 38, న్యూయార్క్ 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినాయిస్‌లో 20 ఉన్నాయి. 10 కంటే తక్కువ ఓట్లున్న రాష్ట్రాలు 30 వరకు ఉన్నాయి.

బుధవారం ఉదయానికి పోలింగ్ ముగియడంతో ఆ వెంటనే లెక్కింపు ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు వెల్లడయిన ఫలితాల ప్రకారం కెంటకీ, ఇండియా, ఓక్లహామా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, మిసిసిపీలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. వర్జీనియా, వెర్మాంట్, మేరీ‌ల్యాండ్‌లో డెమో బైడెన్ విజయం సాధించారు. అయితే, ప్రస్తుత ట్రెండ్ వాస్తవ ఫలితాలను ప్రతిబింబిస్తాయన్న నమ్మకం మాత్రం లేదు. ఎందుకంటే ఈసారి పోలైన మొత్తం ఓట్లలో పోస్టల్‌ బ్యాలెట్లది సింహభాగం. వాటిని లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాల్లో రోజులు..అవసరమైతే వారాలు పట్టే అవకాశం ఉంది.

Tags :
|
|

Advertisement