Advertisement

  • డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం

By: chandrasekar Sat, 30 May 2020 4:59 PM

డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం


డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాకిచ్చారు. సంస్థ నుంచి యూఎస్ వైదొలగడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి యూఎస్ వైదొలగనున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ సరైన హెచ్చరికలు చేయలేదని మండిపడ్డారు. కీలక సమయంలో సరైన పనితీరు కనబరచని కారణంగా సంస్థ నుంచి అమెరికా వైదొలగడానికి నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారని యూఎస్‌కు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం పేర్కొంది.

us,president,trump,sensational,decision ,డబ్ల్యూహెచ్‌ఓకు, అమెరికా, అధ్యక్షుడు, ట్రంప్, సంచలన


కొద్ది రోజులుగా డబ్ల్యూహెచ్‌ఓతో అమెరికాకు ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్‌వో చైనాకు తొత్తుగా వ్యవహరిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు యూఎస్ నుంచి ఫండ్స్ నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను డబ్ల్యూహెచ్‌ఓ ఖండించింది.

ఐక్యరాజ్య సమితికి చెందిన కీలక విభాగం డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా వైదొలగడం ఆ సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఎన్ఓ ఏర్పాటు నుంచి నేటి వరకు అమెరికా పెద్దన్న పాత్రలో కీలక పాత్ర పోషించింది. అలాంటి అగ్రరాజ్యమే వైదొలిగితే.. పరిస్థితి ఏంటనేది ఆసక్తికర చర్చకు దారితీస్తుంది.

Tags :
|
|

Advertisement