Advertisement

BREAKING NEWS : ఏదేమైనా ట్రంప్ మా అధ్యక్షుడు..!

By: Anji Thu, 05 Nov 2020 3:03 PM

BREAKING NEWS : ఏదేమైనా ట్రంప్ మా అధ్యక్షుడు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే దేశంలో నిరసనలు పెల్లుబుకాయి. ప్రతి ఓటును లెక్కించండంటూ ట్రంప్ వ్యతిరేక వర్గాలు ఆందోళనకు దిగాయి.

ఓట్లను ట్రంప్ దోచుకోకుండా చేయాలంటూ నినాదాలు చేశాయి. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు సైతం వీధుల్లో నిరసనలు చేపట్టారు.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రతి ఓటునూ లెక్కించాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్లోని వాషింగ్టన్ స్క్వేర్ వద్ద నిరసనలు జరిగాయి.

కూడలిలో బైఠాయించిన ఆందోళనకారులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, వర్ణ వివక్షను రూపుమాపాలని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు.

వారిలో కొందరు... మిషిగన్, పెన్సిల్వేనియాలో ట్రంప్ దావా వార్తలతో హింసకు పాల్పడగా... కనీసం 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags :

Advertisement