Advertisement

  • కమ్యూనిస్ట్ నేత అంటూ కమల హ్యారిస్ పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్

కమ్యూనిస్ట్ నేత అంటూ కమల హ్యారిస్ పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్

By: Sankar Fri, 09 Oct 2020 10:38 PM

కమ్యూనిస్ట్ నేత అంటూ కమల హ్యారిస్ పై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్


క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ... ఎన్నికల ప్రచారంలో బిజీ కాబోతున్నారు. అయితే, అంతకు ముందే ఇస్తున్న ఇంటర్వ్యూల్లో.. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైట్‌హౌజ్ నుంచి ఫాక్స్ న్యూస్‌తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ట్రంప్‌... ఉపాధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు.

ఆమె సోషలిస్టు కాదు.. కమ్యూనిస్టు అంటూ.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ట్రంప్‌. రాబోయే ఎన్నిక‌ల్లో ఒక‌వేళ బైడెన్ గెలిస్తే... కేవలం రెండుమూడు నెలల్లో క‌మ్యూనిస్టు క‌మ‌లా హారిస్.. ప‌గ్గాల‌ను త‌న చేతుల్లోకి తీసుకుంటుంద‌ని ట్రంప్ ఆరోపించారు. ఆమె అభిప్రాయాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. కమ్యూనిస్టు అని స్పష్టమవుతోందన్నారు. స‌రిహ‌ద్దుల్ని ఓపెన్ చేసి.. హంత‌కుల‌ను, రేపిస్టుల‌ను దేశంలోకి ఆహ్వానించాల‌న్నది కమలాహారిస్‌ అభిమతమనీ.. ట్రంప్ ఆరోపించారు.

క‌మ‌లా హారిస్‌తో ఉపాధ్యక్ష అభ్యర్థుల చ‌ర్చలో పాల్గొన్న త‌ర్వాత ట్రంప్ ఈ కామెంట్ చేయడం విశేషం. మ‌న‌కు ఓ క‌మ్యూనిస్టు నేత‌గా రాబోతున్నార‌ని.. తాను జోసెఫ్ బైడెన్‌తో చ‌ర్చలో పాల్గొన్నాన‌ని, ఆయ‌న రెండు నెల‌ల క‌న్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా చేయ‌లేర‌ని చెప్పారు ట్రంప్‌.

Tags :

Advertisement