Advertisement

  • చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

By: Sankar Sun, 23 Aug 2020 1:30 PM

చైనాతో  వ్యాపారం చేయాలనుకోవడం లేదు..డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


కరోనా మహమ్మారి ప్రారంభం నుంచించిన మీద తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ..తాజాగా మరొకసారి చైనా మీద విరుచుకుపడ్డాడు..వసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడతామని ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో శనివారం పేర్కొన్నారు. కాగా, అమెరికా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద దిగుమతిదారు అన్న సంగతి తెలిసిందే.

‘చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవండం లేదు. అందుకే మేము కూలా అలానే ఆలోచిస్తున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు. కాగా, జనవవరిలో మొదటి దశ వాణిజ్య ఒప్పందాల సమయంలో ట్రంప్‌ చైనాతో ట్రేడ్‌ వార్‌కు తెర తీశారు.

చైనా నుంచి దిగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం కూడా దీటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు విముఖత చూపారు

Tags :
|
|

Advertisement