Advertisement

  • నోబెల్ శాంతి పురస్కారం రేస్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్

నోబెల్ శాంతి పురస్కారం రేస్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్

By: Sankar Wed, 09 Sept 2020 4:39 PM

నోబెల్ శాంతి పురస్కారం రేస్ లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2021కు నామినేట్ చేశారు. ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకుగానూ ట్రంప్‌ను నామినేట్ చేశారు. నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ జెడ్డే అమెరికా అధ్యక్షుడి పేరును నోబెల్ శాంతి పురస్కారానికి ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడం విశేషం.

యూఏఈతో ఒప్పందం కుదరడానికి ముందు ఇజ్రాయెల్‌కు అరబ్ లీగ్‌లోని ఈజిప్టు, జోర్డాన్ దేశాలతో మాత్రమే పూర్తి స్థాయిలో దౌత్య సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఈ తరహా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయమై అమెరికా ఇప్పటికే అరబ్ దేశాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే బహ్రెయిన్‌, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

కాగా ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. 2009లో ఆయనకు నోబెల్ శాంతి బహుమానం దక్కింది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ.. ప్రపంచ శాంతి కోసం పని చేసినందుకు గానూ ఒబామాకు ఈ బహుమతి లభించింది.

Tags :
|

Advertisement