Advertisement

  • అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ రిల‌య‌న్స్ రిటేల్‌లో రూ.7500 కోట్ల పెట్టుబ‌డి

అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ రిల‌య‌న్స్ రిటేల్‌లో రూ.7500 కోట్ల పెట్టుబ‌డి

By: chandrasekar Thu, 10 Sept 2020 5:04 PM

అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ రిల‌య‌న్స్ రిటేల్‌లో రూ.7500 కోట్ల పెట్టుబ‌డి


రిల‌య‌న్స్ రిటేల్ వెంచ‌ర్స్‌లో అమెరికాకు చెందిన సిల్వ‌ర్ లేక్ సంస్థ రూ.7500 కోట్ల పెట్టుబ‌డి పెట్ట‌బోతున్న‌ట్లు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ సంస్థ తెలిపింది. ఆ పెట్టుబ‌డితో ఆర్ఆర్‌వీఎల్‌లో సిల్వ‌ర్ లేక్ సుమారు 1.75 శాతం వాటాను సొంతం చేసుకుంది. రిల‌య‌న్స్ సంస్థ‌లో సిల్వ‌ర్ లేక్ బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం ఇది రెండ‌వ సారి.

ఈ ఏడాది ఆరంభంలో సిల్వ‌ర్ లేక్ 1.35 బిలియ‌న్ల డాల‌ర్లు జియోలో పెట్టుబ‌డి పెట్టింది. దీంతో రిల‌య‌న్స్ షేర్లు ఒక శాతం వృద్ధి చెందాయి. రిల‌య‌న్స్ రిటేల్ వ్యాపారం దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి ఉన్న‌ది. 12 వేల స్టోర్ట్స్ ఉన్నాయి. రిల‌య‌న్స్ రిటేల్ కొత్త వాణిజ్య విధానాన్ని అవ‌లంబిస్తున్న‌ది. చిన్న‌, అసంఘ‌టిత వ్యాపారుల డిజిట‌లైజేష‌న్ ఇటీవ‌ల రిల‌య‌న్స్ ప్రారంభించింది. సుమారు రెండు కోట్ల మంది వ్యాపారులు రిల‌య‌న్స్ రిటేల్‌తో అనుసంధాన‌మై ఉన్నారు.

Tags :

Advertisement