Advertisement

  • అక్టోబర్ నాలుగున సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష..యూపీఎస్‌సీ వెల్లడి

అక్టోబర్ నాలుగున సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష..యూపీఎస్‌సీ వెల్లడి

By: Sankar Wed, 01 July 2020 5:03 PM

అక్టోబర్ నాలుగున సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష..యూపీఎస్‌సీ వెల్లడి



కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం అనేక పరిక్షలు రద్దు అయ్యాయి , మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి ..అందులో ప్రతిష్టాత్మక సివిల్స్ పరీక్షలు కూడా ఉన్నాయి ..దీనితో మళ్ళీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అని అయోమయంలో ఉన్నారు ..అయితే తాజాగా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్‌ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 4న జరుగుతాయని యూపీఎస్‌సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్‌ ప్రిలిమనరీ, ఐఎఫ్‌ఎస్‌ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్న క్రమంలో వారి అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్‌సీ తెలిపింది. అదనపు అభ్యర్ధులకు ఆయా కేంద్రాలు వసతుల పెంపు ఆధారంగా అభ్యర్ధుల పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా అందించాలని కోరింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్షా కేంద్రాలపై తమ ఎంపికను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్‌ అప్లై-ఫస్ట్‌ అలాట్‌’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సీలింగ్‌ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది.

Tags :
|
|

Advertisement