Advertisement

UPSC ఎగ్జామ్‌ అక్టోబ‌ర్ 4నే

By: chandrasekar Thu, 01 Oct 2020 4:49 PM

UPSC ఎగ్జామ్‌ అక్టోబ‌ర్ 4నే


కోవిడ్‌-19 మ‌హమ్మారి అదేవిధంగా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో సంభ‌వించిన‌ వరదలను దృష్టిలో ఉంచుకుని 20 మంది సివిల్ సర్వీస్ అభ్య‌ర్థుల‌ బృందం పరీక్ష వాయిదా కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అక్టోబ‌ర్ 4వ తేదీనే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. అయితే ఈ ఏడాది పరీక్ష తమకు చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థులకు అదనపు అవ‌కాశం క‌ల్పించే అంశాన్ని పరిశీలించాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం యూపీఎస్‌సీని కోరింది.

గ‌డిచిన సోమవారం నాటి వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణలో జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్, జ‌స్టిస్‌ బిఆర్ గవై, జ‌స్టిస్ కృష్ణ మురారి స్పందిస్తూ యూపీఎస్‌సీని మంగళవారం నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. అదేవిధంగా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమిన‌రీ పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లు గురించి కూడా తెలియజేయాలని కోరింది. వాయిదా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన సుప్రీం సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చింది.

Tags :
|
|

Advertisement