Advertisement

  • సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నేడే ..కరోనా లక్షణాలు ఉన్న హాజరు కావొచ్చు

సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నేడే ..కరోనా లక్షణాలు ఉన్న హాజరు కావొచ్చు

By: Sankar Sun, 04 Oct 2020 07:23 AM

సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నేడే ..కరోనా లక్షణాలు ఉన్న హాజరు కావొచ్చు


కొవిడ్‌ లక్షణాలున్నా సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరు కావచ్చని యూపీఎస్సీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారి కోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించాలని, ఆయా లక్షణాలున్న వారిని అందులో పరీక్ష రాయించాలన్నారు. వలక్షణాలున్న వారికి ఫేస్‌షీట్‌, మాస్క్‌ తప్పనిసరని ఆదేశాలిచ్చింది. అయితే మాస్క్‌ లేనివారిని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించరు.

సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్షకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం జరుగనున్న పరీక్ష కోసం జిల్లాలో మొత్తం 99 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 46,171 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇక హైటెక్‌, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా పరీక్షా కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేశారు.

పరీక్షల కో ఆర్డినేటింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి, అదనపు కో ఆర్డినేటింగ్‌ అధికారులుగా అదనపు కలెక్టర్‌ ఎం.కృష్ణ, డీఆర్‌వో అనిల్‌కుమార్‌లు వ్యవహరిస్తున్నారు. పలువురు కేంద్ర పరిశీలకులు సైతం నగరంలో పరీక్షల తీరుతెన్నులను పర్యవేక్షించనున్నారు. 99 మంది లోకల్‌ ఇన్‌స్పెక్టింగ్‌ అధికారులు, 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.

Tags :
|
|
|

Advertisement