Advertisement

మనదేశానికి రానున్న నోకియా 5.3

By: chandrasekar Mon, 10 Aug 2020 2:12 PM

మనదేశానికి రానున్న నోకియా 5.3


మనదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా తన 5.3 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ ఆగస్టులోనే లాంచ్ అవుతుందని కూడా తెలుస్తోంది. అయితే కేవలం నోకియా 5.3 మాత్రమే కాకుండా మరికొన్ని స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం ఇంకా తెలియరాలేదు.

నోకియా 5.3 ధర

నోకియా 5.3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో నోకియా 8.3 5జీ స్మార్ట్ ఫోన్ తో పాటు లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.15,080 నిర్ణయించారు. సియాన్, శాండ్, చార్ కోల్ రంగుల్లో అందుబాటులో ఉంది.

నోకియా 5.3 స్పెసిఫికేషన్లు

దీనిలో 6.55 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ + 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. నోకియా 5.3లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక ముందువైపు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ఇది డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు గానూ, బరువు 185 గ్రాములు ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement