Advertisement

  • గురుపౌర్ణమి సందర్భంగా తన గురువు గురించి చెప్పుకొచ్చిన ఉపాసన

గురుపౌర్ణమి సందర్భంగా తన గురువు గురించి చెప్పుకొచ్చిన ఉపాసన

By: chandrasekar Mon, 06 July 2020 10:30 AM

గురుపౌర్ణమి సందర్భంగా తన గురువు గురించి చెప్పుకొచ్చిన ఉపాసన


అపోలో హాస్పిటల్స్ దేశ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచినవి. అంతటి గొప్ప సంస్థలో ఉపాసన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. గురుపౌర్ణమి సందర్భంగా తన గురువు గురించి చెప్పుకొచ్చింది ఉపాసన. ‘కొందరు చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా ప్రజల బాధలను పోగొట్టేందుకు అపోలో కుటుంబం నిర్విరామంగా పని చేస్తూనే ఉంటుంది'. అని మా తాత డా.ప్రతాప్ రెడ్డి (ఫౌండర్ చైర్మన్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్) చెప్పేవారు.

లవ్‌ యూ తాత, అమ్మమ్మ. మీరే నా జీవితానికి గురువులు' అని చెప్పకొచ్చింది. ‘ఇది వర్కింగ్ సండే. మెడికల్‌కు సంబంధించిన వారికి హాలీడేలు ఉండవు. 24/7 అందుబాటులో ఉంటాం. అవసరం, ఆపదలో ఉన్న వారికి సాయం చేయడమే ప్రథమ కర్తవ్యమని మా తాత చెప్పేవారు’ అని తెలిపింది.

అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా ఉపాసన బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తనకు తోచిన చిట్కాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలను వివరిస్తుంది. సోషల్ మీడియాలో రామ్‌చరణ్ గురించే కాదు ఫ్యామిలీలో జరిగే ఈవెంట్లకు సంబంధిచిన అప్‌డేట్స్ కూడా పెడుతూ ఉంటుంది.

Tags :
|

Advertisement