Advertisement

  • అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్ తో చర్చలు జరిపిన ఐక్యరాజ్యసమితి

అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్ తో చర్చలు జరిపిన ఐక్యరాజ్యసమితి

By: Sankar Wed, 02 Dec 2020 9:31 PM

అమెరికా కొత్త ప్రెసిడెంట్ బైడెన్ తో చర్చలు జరిపిన ఐక్యరాజ్యసమితి


ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ గుట్టెరస్‌తో అమెరికా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జోబైడెన్‌ చర్చలు జరిపారు. అమెరికాకు, ఐరాసకు మధ్య బంధం బలోపేతం చేయడం, ప్రపంచ సమస్యలను కలసికట్టుగా ఎదుర్కోవడంపై వీరిద్దరూ సోమవారం ఫోన్‌లో చర్చించారు.

ఎన్నికల్లో తన విజయానికి అభినందనలు తెలిపినందుకుగాను ఆంటోనీకి బైడెన్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఇథియోపియాలో హింస పెరగడంపై బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారని ఐరాస వర్గాలు తెలిపాయి. బైడెన్‌తో చర్చలపట్ల ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. బైడెన్‌బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నాయి.

ట్రంప్‌ హయంలో ఐరాసతో యూఎస్‌ సంబంధాలు పలు అంశాల్లో క్షీణించిన సంగతి తెలిసిందే. పలు కీలక ఐరాస సమాఖ్యలు, సంస్థల నుంచి యూఎస్‌ వైదొలిగేలా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకున్నారు. డబ్లు్యహెచ్‌ఓ, పారిస్‌ ఒప్పందం, యునెస్కో, మానవహక్కుల సంఘం నుంచి యూఎస్‌ ట్రంప్‌ హయంలో బయటకు వచ్చింది. కాగా తిరిగి పారిస్‌ ఒప్పందంలో చేరతామని బైడెన్‌ ఇటీవల ప్రకటించారు.

Tags :
|

Advertisement