Advertisement

  • దేశంలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ ఓపెన్

దేశంలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు ఇవే.. అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ ఓపెన్

By: Sankar Thu, 01 Oct 2020 07:11 AM

దేశంలో అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు ఇవే.. అక్టోబర్ 15  నుంచి సినిమా హాల్స్ ఓపెన్


దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ను విడతల వారీగా ఎత్తివేస్తున్నారు..ఇప్పటికే దేశంలో అన్‌లాక్ 4.0 ముగియాగా తాజాగా కేంద్రం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది...అయితే ఇందులో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఎంటర్ టైన్ మెంట్ పార్క్స్ ప్రారంభం కానున్నాయి.

అయితే, థియేటర్లకు కొన్ని షరతులు కూడా పెట్టింది కేంద్రం.. 50 శాతం సీటింగ్‌తో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతించింది. క్రీడాకారులకోసం స్విమ్మింగ్ పూల్స్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలలు కూడా పునఃప్రారంభించనున్నారు. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదించాక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో ఆన్‌లైన్ తరగతులను కూడా సమాంతరంగా అనుమతిస్తామని పేర్కొంది కేంద్రం.

అయితే, అన్ని చోట్లా కఠినంగా కోవిడ్ నియమాలు, మాస్కులు ధరించడం లాంటి ఇతర సురక్షిత విధానాల పాటించాలని పేర్కొంది కేంద్రం.. అక్టోబర్ 15 తర్వాత విడతలవారీగా విద్యాసంస్థలను పునఃప్రారంభించేందుకు రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. విద్య, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, ధార్మిక, రాజకీయ సభలు, సమావేశాలకు 100 మంది వరకు ఇప్పటికే అనుమతి ఉండగా.. 100 మందికి మించి అనుమతించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది.

సాధారణ సినిమా హాల్స్ లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో, గరిష్టంగా 200 మంది వరకే అనుమతి ఇవ్వాలని పేర్కొంది కేంద్రం. ఇక, ఓపెన్ సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్ సామర్థ్యాన్ని బట్టి గరిష్ట సంఖ్యపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికీ కొనసాగే ఆంక్షల్లో అంతర్జాతీయ విమానయానం ఉంటుందని తెలిపిన కేంద్రం.. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇక, అంతర్రాష్ట్ర ప్రజా రవాణా, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement