Advertisement

  • అన్‌లాక్ 3.O: సినీ ప్రియుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

అన్‌లాక్ 3.O: సినీ ప్రియుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

By: chandrasekar Thu, 30 July 2020 10:44 AM

అన్‌లాక్ 3.O: సినీ ప్రియుల ఆశలపై  నీళ్లు చల్లిన కేంద్రం


తాజాగా కేంద్రం అన్‌లాక్ 3.O మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగు నెలలుగా మూత పడ్డ థియేటర్స్‌కు మల్లీప్లెక్స్ ఎపుడెపుడు తెరుచుకోనున్నాయా అనే ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఈ సందర్భంగా అన్‌లాక్ 3.Oలో కేంద్రం కంటెన్మెంట్ జోన్ పరిధిలో కాకుండా మిగిలిన ఏరియాల్లో థియేటర్స్, మల్లీప్లెక్స్‌తో పాటు బార్లు, పార్కులు, స్మిమ్మింగ్ పూల్స్, మెట్రో రైల్స్ సమావేశ మందిరాలు తెరుచుకోవడానికి అనుమతులు నిరాకరించింది. ఆగష్టు 5 నుంచి జిమ్స్, యోగా సెంటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం పూర్తిగా ఎత్తివేసినట్టు తెలిపింది.

నాలుగు నెలలుగా దేశ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ మూత పడిన సంగతి తెలిసిందే. థియేటర్స్‌ మూత పడటంతో దేశ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలకు దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్‌లో వేసవి‌‌లో విడుదల కావాల్సిన చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మరొకొన్ని మాత్రం ఓటీటీ బాట పట్టాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా నియమాలు ఉండేలా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ప్రతి షో తర్వాత థియేటర్ మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. దాంతో పాటు ఇది వరకటిలా కాకుండా సీటింగ్‌కు మరో సీటింగ్‌కు సామాజిక దూరం పాటించేలా కనీసం 2 మీటర్ల దూరం ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరి కేంద్రం థియేటర్స్‌ ఓపెన్‌కు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కొంత మంది నిర్మాతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పైగా కేంద్రం పర్మిషన్ ఇచ్చినా ఇప్పటికే ప్రజలు స్వీయ నియంత్రణలో భాగంగా హోటల్స్‌కు మాల్స్‌కు వెళ్లడం తగ్గించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పర్మిషన్ ఇచ్చింది కదా అని థియేటర్స్ యాజామాన్యాలు ఓపెన్ చేసినా కరోనా భయంతో ప్రజలు థియేటర్ వైపు అడుగులు వేస్తారా అనేది డౌట్.

Tags :
|

Advertisement