Advertisement

  • కరోనా వైరస్ గురించి కీలక విషయాలను ఆవిష్కరించిన ఫ్లోరియా యూనివర్శిటీ పరిశోధకులు

కరోనా వైరస్ గురించి కీలక విషయాలను ఆవిష్కరించిన ఫ్లోరియా యూనివర్శిటీ పరిశోధకులు

By: chandrasekar Thu, 12 Nov 2020 10:20 PM

కరోనా వైరస్ గురించి కీలక విషయాలను ఆవిష్కరించిన ఫ్లోరియా యూనివర్శిటీ పరిశోధకులు


కరోనా వైరస్ ని సమర్ధవంతంగా అడ్డుకునే రెండు పదార్ధాల్ని కనుగొన్నారు. ఇక మానవ శరీరంలోకి చొరబడదని ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ గురించి కీలక విషయాలు తెలిశాయి. సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీ పరిశోధనల్లో ఇది కనుగొన్నారు. ఈ మహమ్మారి గుట్టు విప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా సౌత్ ఫ్లోరిడా ఆరోగ్య విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ యూచెన్ కనుగొన్న ఆవిష్కరణ సరికొత్త పరిణామాలకు దారి తీయనుంది. కరోనా వైరస్ అనేది మానవ శరీర కణాల్లోకి ఎలా వెళ్తుంది. దీన్ని ఎలా అడ్డుకోవాలనే విషయంపై పరిశోధనలు జరిపిన అనంతరం ఎట్టకేలకు గుట్టు విప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించి, తమ సంఖ్యను పెంచుకునేందుకు కరోనా వైరస్‌కు ఉపయోగపడే రెండుకీ ప్రొటీన్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు ప్రోటీన్లను కాల్పైయిన్‌ ఇన్హిబిటర్‌ 2, కాల్పైయిన్‌ ఇన్హిబిటర్‌ 12 అనే పదార్థాలు సమర్థవంతంగా అడ్డుకుంటాయని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ మల్టీ లెవల్‌లో మానవ శరీరంపై దాడిచేస్తుంది. ముందుగా ఊపిరితిత్తుల లోపల ఉండే కణాలపై ఎటాక్ చేస్తుంది. అనంతరం మొత్తం కణ యంత్రాంగాన్ని స్వాధీనం చేసుకుని భారీగా వైరస్ లను ఏర్పరుస్తుంది. కణంలోకి ప్రవేశించడానికి వైరస్‌కు లైజో జోమల్‌ ప్రొటీజ్‌ క్యాథెప్సిన్‌ ఎల్‌ అనే మానవ ప్రొటీన్‌, కణంలో తన ప్రతులను పెంచుకోవడంలో ఎంపీఆర్‌వో అనే వైరల్‌ ప్రొటీన్‌ను కరోనా వైరస్‌ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్న రెండు పదార్ధాలతో ఈ ప్రోటీన్లను అడ్డుకోవచ్చని సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ రెండు పదార్ధాల్ని కాల్పైయిన్‌ ఇన్హిబిటర్స్‌ 2, 12 గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనను మరికాస్త అభివృద్ధి చేస్తే ఇక కరోనా వైరస్ కు మందు కనుగొన్నట్టే. వైరస్ అనేదే ఇక శరీరంలో చొరబడకుండజా చేయవచ్చు. అందుకే ఫ్లోరిడా యూనివర్శిటీ తాజా పరిశోధన కొత్త ఆలోచనలు రేపుతోంది.

Tags :

Advertisement