Advertisement

  • తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచనలు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచనలు

By: chandrasekar Thu, 09 July 2020 11:12 AM

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచనలు


ప్రజలను కరోనా నుంచి రక్షించడమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ముందున్న ముఖ్యమైన అంశం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి మిగతా విషయాలు పక్కన పెట్టి ఈ అంశం పైన అధిక దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లక్షల్లో ఫీజులు వసూలు చెయ్యడం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వెంటిలేటర్స్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించాలని ఆయన సూచించారు.

అవసరమైతే ఢిల్లీ తరహాలో పదివేల పడకల ఆసుపత్రినిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని అన్నారు. హైదరాబాద్ ప్రజలలో కరోనా భయం, ఆందోళన ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కంటైన్‌మెంట్ జోన్లలో నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు.

ఢిల్లీ, ఏపీ తరహాలో కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర వైద్య శాఖ తరపున రూ. 215 కోట్ల ను వైద్య పరికరాల కొనుగోలు కోసం అందించామని కిషన్ రెడ్డి తెలిపారు. 22 లక్షల 50 వేల హైడ్రాక్షి క్లోరోక్విన్ టాబ్లెట్లును తెలంగాణకు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

Tags :

Advertisement