Advertisement

  • ఓటింగ్ శాతం తగ్గినందుకు ప్రభుత్వం తలదించుకోవాలి ....కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఓటింగ్ శాతం తగ్గినందుకు ప్రభుత్వం తలదించుకోవాలి ....కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By: Sankar Tue, 01 Dec 2020 8:26 PM

ఓటింగ్ శాతం తగ్గినందుకు ప్రభుత్వం తలదించుకోవాలి ....కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


జిహెచ్ఎంసి ఎన్నికలు కొద్దిసేపటి క్రితమే ముగిసాయి ..ఎన్నడూ లేనంతగా ఈసారి పోలింగ్ చాలా తగ్గింది ..సినిమా స్టార్స్ , స్వచ్చంధ సంస్థలు ఎంత ప్రచారం చేసిన కూడా నగర ప్రజలు ఓట్ వేసేందుకు అంతగా ఆసక్తి చూయించలేదు..అయితే జిహెచ్ఎంసి ఓటింగ్ శాతం తగ్గినందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంది. మేము గెలిచిన గెల్వ కున్న వాళ్ళు మాత్రం గెలువొద్దు అని నిరంకుశ ,సంకుచిత మానసిక తనం అధికార పార్టీ ప్రదర్శించింది. ఆదరబాదరగా ఓడిపోతామనే ఆలోచనతో ప్రజాస్వామ్యంని అపహాస్యం చేస్తూ ఈ ఎన్నికల ను హడావుడి గా నిర్వహించింది ప్రజలు కూడా తీవ్రంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేసారు.

జమ్మూ కాశ్మీర్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాకిస్థాన్ సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారు. హైద్రాబాద్ లో చైతన్య వంతమైన ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారని అనుకున్నాం అయిన పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉంది అన్నారు.

Tags :
|

Advertisement