Advertisement

కరోనా బారిన పడిన కేంద్ర జలశక్తి మంత్రి

By: Sankar Thu, 20 Aug 2020 5:08 PM

కరోనా బారిన పడిన కేంద్ర జలశక్తి మంత్రి


కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. సెలబ్రిటీలు, సామాన్యుల అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరోకరు చేరారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు.

‘కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లాను. కరోనా టెస్ట్‌ చేయించాను. రిపోర్టులో పాజిటివ్‌ అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యాను. గత వారం రోజుల నుంచి నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ గజేంద్ర సింగ్‌ షేకావత్‌ హిందీలో ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది.

Tags :
|
|

Advertisement