Advertisement

  • భారత్ బంద్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

భారత్ బంద్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

By: chandrasekar Tue, 08 Dec 2020 08:41 AM

భారత్ బంద్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శ


ఢిల్లీ లో చోటుచేసుకున్న రైతుల పోరాటం ఈరోజు భారత్ బంద్ కు దారితీసింది. వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె, భారత్ బంద్ పై బీజేపీ స్పందించింది. కొన్ని రాజకీయపార్టీలు స్వార్ధం కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సమ్మె జరుగుతోంది. ఈ రోజు భారత్ బంద్ జరగనుంది. భారత్ బంద్ కు విపక్షపార్టీలు మద్దతిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా ప్రస్తుతం స్పందిస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యవహారంపై మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. రైతులు స్వచ్ఛంగా తమ పంటల్ని లాభసాటి ధరలకు అమ్ముకునేలా చట్టం తెచ్చిందని అన్నారు. వ్యవసాయ చట్టాల ద్వారా కేంద్రం రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. దీనివల్ల రైతులకు లాభాలు చేకూరుతుందని తెలిపారు.

కానీ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. రైతు చట్టాలపై రాజకీయం చేస్తూ రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటు పంటల భీమా పధకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాల్లో ఒక్క పదం కూడా లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రైతుల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు చేపట్టిన చర్యలవల్ల ఇది తీవ్రరూపం దాల్చిందని తెలిపారు.


Tags :
|

Advertisement