Advertisement

  • ఎన్నికలలో చిన్నవి పెద్దవి ఉండవు...ఎన్నికలంటే ఎన్నికలే ...అమిత్ షా

ఎన్నికలలో చిన్నవి పెద్దవి ఉండవు...ఎన్నికలంటే ఎన్నికలే ...అమిత్ షా

By: Sankar Mon, 30 Nov 2020 06:15 AM

ఎన్నికలలో చిన్నవి పెద్దవి ఉండవు...ఎన్నికలంటే ఎన్నికలే ...అమిత్ షా


తాము ఏ ఎన్నికను చిన్నదిగా చూడమని, ఎన్నికలంటే ఎన్నికలేనన్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా .. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చిన్నవి కానేకాదన్నారు.

తాము హైదరాబాద్‌కు సీఎంను కొట్టడానికి రాలేదని, సీఎం కేసీఆర్‌ 100 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చామన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదని, మేయర్‌ పీఠం కైవసం చేసుకునేందుకేనన్నారు.

రోడ్‌షోలో ప్రజాస్పందన చూస్తుంటే మేయర్‌ పీఠం బీజేపీదేనన్నది స్పష్టమైందన్నారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కేసీఆర్‌చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఐదేళ్లలో ఎందుకు చేయలేదన్నారు. ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు ఎందుకు రావడం లేదన్నారు.

Tags :
|

Advertisement