Advertisement

  • అమిత్ షాకు కరోనా నెగటివ్ ...కానీ ఇంకా ఆసుపత్రిలోనే

అమిత్ షాకు కరోనా నెగటివ్ ...కానీ ఇంకా ఆసుపత్రిలోనే

By: Sankar Sun, 09 Aug 2020 1:00 PM

అమిత్ షాకు కరోనా నెగటివ్ ...కానీ ఇంకా ఆసుపత్రిలోనే



కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు ..ఆదివారం నాడు చేసిన పరీక్షలో ఆయనకు నెగటివ్ వచ్చినట్లు వెల్లడయింది ..బీజేపీ ఎంపీ మనోజ్ తివారి , అమిత్ షాకు కరోనా నెగటివ్ వచ్చిన విషయాన్నీ ధ్రువీకరించారు ..అయితే అమిత్ షా ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేది మాత్రం ఇంకా కంఫర్మ్ కాలేదు ..

కాగా కరోనా పాజిటివ్ రావడంతో హోంమంత్రి అమిత్ షా ఆగష్టు 2 న హాస్పిటల్ లో అడ్మిట్ అయినా విషయం తెలిసిందే..ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ కొన్ని కరోనా లక్షణాలు చూయించడం వాళ్ళ డాక్టర్ల సలహా మేరకు అమిత్ షా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు ..

ప్రస్తుతం గురుగ్రామ లోని మేదాంత హాస్పిటల్ లో అమిత్ షా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ..కరోనా పాజిటివ్ కి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాబినెట్ మీటింగ్ కు అమిత్ షా అటెండ్ అయ్యారు ..అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడం వాళ్ళ అయన నుంచి మిగిలిన వారికీ వైరస్ సోకలేదు ..

Tags :
|
|
|

Advertisement