Advertisement

  • అర్ణబ్ గోస్వామి అరెస్టుపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

అర్ణబ్ గోస్వామి అరెస్టుపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

By: Sankar Wed, 04 Nov 2020 5:38 PM

అర్ణబ్ గోస్వామి అరెస్టుపై స్పందించిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా


రిపబ్లిక్‌ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్‌ గోస్వామి అరెస్టుపై స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇంటీరియల్‌ డిజైనర్‌ మరణానికి సంబంధించిన విషయంలో ఆయనను మహారాష్ట్ర పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

అర్నాబ్‌ గోస్వామి అరెస్ట్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి మండిపడ్డారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందని, మళ్లీ ఎమర్జన్సీ రోజులు వచ్చాయని అమిత్‌ షా సీరియస్ అయ్యారు. సోనియా, రాహుల్‌ గాంధీ డైరెక్షన్‌లోనే మహారాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.

అర్నబ్ అరెస్ట్‌పై ట్విట్టర్ వేదికగా అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మరోసారి ప్రజాస్వామ్యాన్ని సిగ్గుపడేలా చేశాయన్నారు. రిపబ్లిక్ టీవీ, అర్ణబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం వ్యక్తి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండే మీడియాపై దాడి వంటిదే అన్నారు షా. ఇది మాకు అత్యయిక పరిస్థితిని గుర్తు చేస్తోందని ట్విట్టర్‌లోపేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడిని తప్పకుండా వ్యతిరేకించాలన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా విమర్శలు చేశారు.


Tags :

Advertisement