Advertisement

  • కొత్త వైరస్ గురించి ఆందోళన అవసరం లేదు ..ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్

కొత్త వైరస్ గురించి ఆందోళన అవసరం లేదు ..ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్

By: Sankar Tue, 22 Dec 2020 5:15 PM

కొత్త వైరస్ గురించి ఆందోళన అవసరం లేదు ..ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్


కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో తగ్గుముఖం పడుతుంది..కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుండటంతో ఇక కరోనా నుంచి ఉపశమనం లభించినట్లే అని భావిస్తున్న తరుణంలో బ్రిటన్ లో మరొక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది..ఈ కొత్త వైరస్ కారణంగా బ్రిటన్ లో లాక్ డౌన్ విధించారు...బ్రిటన్ నుంచి వచ్చే విమానాల మీద కూడా అన్ని దేశాలు నిఘా పెట్టాయి..

అయితే యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది (కొత్త‌రూపు సంత‌రించుకుని) వేగంగా విస్త‌రిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌తో మ‌న‌కు ముప్పేమీ లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. యూకే గ‌త సెప్టెంబ‌ర్‌లో ఈ వైర‌స్‌ను గుర్తించ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఆ క‌రోనా ఉత్ప‌రివ‌ర్త‌నం ఆనవాళ్లు కనిపించ‌లేద‌ని తెలిపింది. యూకే బ‌య‌ట‌ప‌డ్డ ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌ 70 శాతం ఎక్కువ సులువుగా సంక్రమిస్తుంద‌ని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కేసులు మ‌రింత పెరుగ‌తాయనే భ‌యాందోళ‌న‌లు రేకెత్తాయి.

కానీ మ‌న దేశంలో మాత్రం దాని గురించి ఆందోళ‌న చెందాల్సిన అస‌వ‌రం లేద‌ని ఆరోగ్య‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ చెప్పారు. కాగా, ఈ కొత్త వైర‌స్ దేశంలో ప్ర‌వేశించకుండా కేంద్రం ఇప్ప‌టికే యూకేకు విమానాల రాక‌పోక‌ల‌పై తాత్కాలిక నిషేధం విధించింది. బుధవారం అర్ధ‌రాత్రి నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ నిషేధం.. ఈ నెల 31 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంత‌కుముందు ఇప్ప‌టికే యూకే నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల కోసం కేంద్రం స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక పేరుతో కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు చేసింది.

Tags :

Advertisement