Advertisement

  • కరోనా నుంచి కోలుకున్నవారికి మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం

కరోనా నుంచి కోలుకున్నవారికి మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం

By: Sankar Sun, 13 Sept 2020 12:21 PM

కరోనా నుంచి కోలుకున్నవారికి మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం


కరోనా వైరస్‌ విజృంభిస్తూనే వుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కాస్తా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని చెప్పింది. ఎప్పటిలాగే మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి అని పేర్కొంది. తగినంత గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలని సూచించింది.

Tags :
|

Advertisement