Advertisement

  • దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత వారికే ప్రాధాన్యత

దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత వారికే ప్రాధాన్యత

By: Sankar Fri, 21 Aug 2020 08:50 AM

దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తొలుత వారికే ప్రాధాన్యత


కరోనా వాక్సిన్ ప్రయోగాలు దేశంలో చివరి దశకు వచ్చాయి..అయితే కరోనా వాక్సిన్ ఆమోదం పొంది, అందుబాటులోకి వస్తే తొలి విడతగా 50 లక్షల డోసులను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తోంది. వీటిని కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆర్మీ, ఇతరులకు అందజేయనున్నారు.

రెగ్యులేటరీ విధానాలు దాటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని సరఫరా, పంపిణీతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత చర్చనీయాంశమైంది. ముందుండి పోరాడుతున్నవారికి టీకా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నా వీలైనంత త్వరగా ఎక్కువ మంది సాధారణ జనాభాకు అందజేయాలి.

ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డోసులు అభివృద్ధి చేసే అవకాశం ఉన్నందున, ప్రభుత్వాన్ని దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలు మార్కెట్ భరోసా అంచనాలు కోరుతున్నారు.. బహుశా 2020 చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని వారాల వ్యవధిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

టీకా అభివృద్ధి చేస్తున్న సంస్థలతో నీతి-ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ నేతృత్వంలో కోవిడ్ వ్యాక్సిన్ నిపుణుల బృందం సోమవారం సమావేశమయ్యింది. ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో తెలియాలంటే వ్యాక్సిన్ తయారీ, ధరల శ్రేణులు, సలహాలు, సామర్థ్యాలను వివరించే ప్రతిపాదనలను సమర్పించాలని టీకా తయారీ సంస్థలను ఈ సందర్భంగా కోరింది.

Tags :

Advertisement