Advertisement

  • ఆ రాష్ట్రాలకు వ్యవసాయ చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్రం ..

ఆ రాష్ట్రాలకు వ్యవసాయ చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్రం ..

By: Sankar Wed, 16 Dec 2020 1:40 PM

ఆ రాష్ట్రాలకు వ్యవసాయ చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్రం ..


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీ సరిహద్దులో గత కొంతకాలంగా రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు..వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు ..ప్రభుత్వం వారితో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ వారు మాత్రం రైతు చట్టాల రద్దును మాత్రమే డిమాండ్ చేస్తున్నారు...

దీనితో కొత్త చ‌ట్టాల నుంచి పంజాబ్, హ‌ర్యానా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు మిన‌హాయించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం జ‌ర‌గ‌బోయే కేబినెట్ స‌మావేశంలో దీనిపై చ‌ర్చించ‌న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంతేకాకుండా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కూడా కొన‌సాగుతుంద‌ని హామీ ఇచ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

నిజానికి ఈ అంశం ఎజెండాలో లేక‌పోయినా.. రోజురోజుకూ రైతుల ఉద్య‌మం ఉద్ధృతంగా మారుతున్న నేప‌థ్యంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై కూడా చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం పంపిన ప్ర‌తి ప్ర‌తిపాద‌న‌నూ రైతులు తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. చ‌ట్టాల‌ను పూర్తి ర‌ద్దు చేసి, క‌నీస మ‌ద్దతు ధ‌ర‌పై చ‌ట్టం చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Tags :
|

Advertisement