Advertisement

  • నేడే కేంద్రానికి రైతు సంఘాల మధ్య మరొకదఫా చర్చలు

నేడే కేంద్రానికి రైతు సంఘాల మధ్య మరొకదఫా చర్చలు

By: Sankar Wed, 30 Dec 2020 08:17 AM

నేడే కేంద్రానికి రైతు సంఘాల మధ్య మరొకదఫా చర్చలు


ఢిల్లీ సరిహద్దులో గత కొంతకాలంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే..కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనీ రైతులు గత కొన్నిరోజులుగా నిరసనలు తెలుపుతున్నారు..అయితే ఇప్పటికే కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలం అయ్యాయి..ఇప్పుడు మరొకసారి కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు సిద్ధం అయ్యాయి...

చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దుకు విధి విధానాలను రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడంతో పాటు గతంలో జరిగిన చర్చల సందర్భంగా తాము లేవనెత్తిన మరో రెండు డిమాండ్లపై మాత్రమే చర్చ జరగాలని తేల్చి చెప్పారు.

నేడు రైతు నేతలతో చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్, గోయల్‌ హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరుపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం తరఫున రైతులతో వ్యవసాయ మంత్రి తోమర్, రైల్వే మంత్రి గోయల్‌ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement