Advertisement

సుశాంత్ కేసులో మరో ఊహించని మలుపు...!

By: Anji Fri, 02 Oct 2020 4:56 PM

సుశాంత్ కేసులో మరో ఊహించని మలుపు...!

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం ఈ ఏడాదిలో జరిగిన డిజాస్టరస్ మూమెంట్స్ లో ఒకటి. అయితే గత జూన్ లో నెలలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అన్నది మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

అలా ఈ కేసు విషయంలో ఇప్పటి వరకు ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ తో కొనసాగుతుంది. సుశాంత్ ది హత్యే అయ్యి ఉంటుంది అని అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఎయిమ్స్ వారు అందించిన రిపోర్ట్ ప్రకారం ఇది ఆత్మహత్యే అని తెలిపారు. సుశాంత్ ఒంటిలో ఎలాంటి విషం లేదని అది ఆత్మహత్యే అని అన్నారు.

కానీ ఈ కేసును టేకప్ చేసిన సిబిఐ వారు లేటెస్ట్ ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వారు ఆత్మ హత్య అని చెప్పినప్పటికీ తాము ఇది ఆత్మ హత్యా, హత్యా అన్నది తేల్చలేకపోతున్నామని అందుకే ఈ కేసును హత్యా కేసు సెక్షన్ 302లో చేర్చారట.

సుశాంత్ ను కేవలం పాయిజన్ ఇచ్చి హతమార్చకున్నా వేరేలా చేసి ఉండొచ్చు కదా అనే కొత్త పాయింట్ ను వీరు రైజ్ చేశారట. దీనితో ఈ కేసు ఇపుడు మరో సరికొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది.

Tags :

Advertisement