Advertisement

  • అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనున్న ప్రభుత్వం...

అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనున్న ప్రభుత్వం...

By: chandrasekar Thu, 22 Oct 2020 3:13 PM

అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనున్న ప్రభుత్వం...


ప్రపంచంలోనే పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పరిచయం అవసరం లేని పేరు. ప్రత్యేక చట్టం కింద ఈ అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనుంది ప్రభుత్వం. వేలంపాటకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇండియా సహా పలు ప్రపంచదేశాల్లో ఉగ్రదాడులు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి తెలిసిందే. ఉగ్రదాడులకు పాల్పడి దేశం వదిలి పారిపోయిన దావూద్ ఇబ్రహీం కోసం ఇండియా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అండర్ వరల్డ్ డాన్ పూర్వీకుల ఆస్థుల్ని వేలం వేయనుం ఇప్పుడు అతని ఆస్థుల్ని వేలం వేయనుంది. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్‌లో దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలం ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటికే దావూద్ ఆస్థుల వేల్యువేషన్​ ప్రక్రియ ముగిసింది. రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్​ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ ఇబ్రహీం​కు స్థిరాస్తులు ఉన్నాయి. 1980లో ఇక్కడున్న బంగ్లాలోనే దావూద్​ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. ఈ భవంతిని దావూద్​ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావుద్​ కుటుంబసభ్యులు ఈ భవంతిని వదిలివేశారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే స్థితికి చేరుకుంది. తాజాగా ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు దావూద్​ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి రెడీ అయ్యారు. అదేవిధంగా దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేయనున్నారు.

Tags :
|

Advertisement