Advertisement

  • లక్ష్మి విలాస్ బ్యాంకు ను డీబీఐఎల్ తో విలీనం చేయనున్న ఆర్బీఐ

లక్ష్మి విలాస్ బ్యాంకు ను డీబీఐఎల్ తో విలీనం చేయనున్న ఆర్బీఐ

By: Sankar Tue, 17 Nov 2020 11:29 PM

లక్ష్మి విలాస్ బ్యాంకు ను డీబీఐఎల్ తో విలీనం చేయనున్న ఆర్బీఐ


ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగం బ్యాంకు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది.

ఒక నెల తాత్కాలిక నిషేధం ముగిసిన వెంటనే ఈ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డీబీఐఎల్) తో విలీనం చేయనుంది. ఈ మేరకు ఒక ముసాయిదా పథకాన్ని ఆవిష్కరించినట్లు మంగళవారం వెల్లడించింది.ఇందుకు డీబీఐఎల్ 2,500 కోట్ల రూపాయల అదనపు మూలధనాన్ని ముందస్తుగా సమకూరుస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.

డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నామని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్‌మనోహరన్‌ను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. ముసాయిదా పథకంపై ఇరు బ్యాంకుల సభ్యులు, డిపాజిటర్లు ఇతర రుణదాతల నుండి సూచనలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తోంది. ఇవి 2020 నవంబర్ 20 న సాయంత్రం 5 గంటలలోపు తమకు చేరాలని ఆర్‌బీఐ తన నోటీసులో తెలిపింది. మరోవైపు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం మారటోరియం విధించింది.

Tags :
|
|

Advertisement