Advertisement

  • ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న వ్యక్తి ..కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న వ్యక్తి ..కాపాడిన పోలీసులు

By: Sankar Fri, 04 Sept 2020 9:24 PM

ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న వ్యక్తి ..కాపాడిన పోలీసులు


రుణం చెల్లించలేక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా చిలువేరు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుభాని అనే వ్యక్తి తెలిసిన వారి వద్ద రూ. 15 లక్షల వరకు అప్పు చేశాడు.

అప్పుచ్చిన వారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడంతో పనిచేసే ఆభరణాల దుకాణం నుంచి డబ్బులు అపహరించాడు. విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి శీతల పానీయంలో పురుగు మందు కలుపుకొని సేవించాడు. అంతకుముందు ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. అప్రమత్తమైన అతడి స్నేహితులు పోలీసులను సంప్రదించారు.

సాంకేతికత సాయంతో అర్ధరాత్రి సమయంలో సుభాని ఆచూకీ కనుగొన్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Tags :
|
|
|
|

Advertisement