Advertisement

  • ఆ దేశంలో కరోనా నిబంధనలు అతిక్రమిస్తే పదిలక్షల జరిమానా

ఆ దేశంలో కరోనా నిబంధనలు అతిక్రమిస్తే పదిలక్షల జరిమానా

By: Sankar Sun, 20 Sept 2020 2:32 PM

ఆ దేశంలో కరోనా నిబంధనలు అతిక్రమిస్తే పదిలక్షల జరిమానా


కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈ వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూనే వుంది. ఈ వైరస్ ఇంగ్లాండ్‌ కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది.

తాజాగా రూపొందించిన కొవిడ్‌ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల (దాదాపు రూ.10లక్షలు) వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు వైరస్‌ లక్షణాలున్నవారు కచ్చితంగా పది నుంచి 14రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు. అయితే, నిబంధనలు ఉల్లంఘించే వారిపై వెయ్యి నుంచి పదివేల పౌండ్ల వరకు జరిమానా విధించేందుకు అక్కడి అధికారులు సిద్ధమయ్యారు.

సెప్టెంబర్‌ 28 నుంచి అక్కడ ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌లో రెండోదఫా వైరస్‌ విజృంభణ కనిపిస్తున్నట్లు తాజాగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు.

Tags :
|
|
|

Advertisement