Advertisement

  • వాక్సిన్ ఇచ్చేముందు మెడికల్ హిస్టరీ పరిశీలించండి ...బ్రిటన్‌ ప్రభుత్వం

వాక్సిన్ ఇచ్చేముందు మెడికల్ హిస్టరీ పరిశీలించండి ...బ్రిటన్‌ ప్రభుత్వం

By: Sankar Thu, 10 Dec 2020 10:07 AM

వాక్సిన్ ఇచ్చేముందు మెడికల్ హిస్టరీ పరిశీలించండి ...బ్రిటన్‌ ప్రభుత్వం


గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఒకవైపు కరోనా విజృంబిస్తున్నప్పటికీ మరోవైపు ప్రపంచ దేశాలు కరోనా కు వాక్సిన్ ను కనుగొనే పనిలో పడ్డాయి...ఇక అందులో భాగంగా బ్రిటన్ కు చెందిన ఫైజర్ కరోనా వాక్సిన్ ను బ్రిటన్ ప్రజల ముందు ఉంచింది..

అయితే బ్రిటన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్‌– బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నేషనల్‌ హెల్త్‌ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది.

ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్‌ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్‌ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :
|
|
|
|

Advertisement