Advertisement

  • బ్రిటన్ ప్రధాని ఇండియాకు వస్తున్నాడు..ధ్రువీకరించిన యూకే

బ్రిటన్ ప్రధాని ఇండియాకు వస్తున్నాడు..ధ్రువీకరించిన యూకే

By: Sankar Wed, 23 Dec 2020 1:20 PM

బ్రిటన్ ప్రధాని ఇండియాకు వస్తున్నాడు..ధ్రువీకరించిన యూకే


భార‌త గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు బ్రిటీష్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఇండియాకు రానున్నారు. ఈ విష‌యాన్ని యూకే కామ‌న్‌వెల్త్‌, అభివృద్ధి వ్య‌వ‌హారాల శాఖా మంత్రి తారిక్ అహ్మ‌ద్ ద్రువీక‌రించారు. జ‌న‌వ‌రి 26వ తేదీన జ‌ర‌గ‌నున్న భార‌త ఆర్డీ ప‌రేడ్‌లో బోరిస్ ముఖ్య అతిథిగా పాల్గొంటార‌న్నారు.

ఇండియాతో బ‌ల‌మైన మైత్రిని కోరుకుంటున్నామ‌ని తారిక్ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇండో ప‌సిఫిక్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా భార‌త్‌తో బంధాన్ని ద్రుడ‌ప‌ర‌చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో.. ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఇండియా టూర్‌కు రాక‌పోవ‌చ్చు అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈనేప‌థ్యంలో మంత్రి తారిక్ పోస్టు చేసిన ట్వీట్ ఆ సందేహాల‌ను నివృత్తి చేసింది. న‌వంబ‌ర్ 27వ తేదీన ఫోన్‌లో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. గ‌ణ‌తంత్య్ర వేడుక‌ల‌కు అతిథిగా హాజ‌రుకావాలంటూ బోరిస్ జాన్స‌న్‌ను ఆహ్వానించారు.కాగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులు బ్రిటన్ ప్రధాని గణతంత్ర వేడులకు రావొద్దు అన్ని లేఖ రాస్తాం అని ప్రకటించారు..ఢిల్లీలో చాల రోజులుగా తాము ఉద్యమం చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు అని అందుకే ఈ లేఖ అని వారు ప్రకటించారు...

Tags :
|
|

Advertisement