Advertisement

  • యూఏఈ లో పెరుగుతున్న కరోనా కేసులు ..ఐపీయల్ నిర్వహణపై అభిమానుల్లో ఆందోళన

యూఏఈ లో పెరుగుతున్న కరోనా కేసులు ..ఐపీయల్ నిర్వహణపై అభిమానుల్లో ఆందోళన

By: Sankar Thu, 20 Aug 2020 2:29 PM

యూఏఈ లో పెరుగుతున్న కరోనా కేసులు ..ఐపీయల్ నిర్వహణపై అభిమానుల్లో ఆందోళన


ఇండియన్ క్రికెట్ లో అత్యంత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీయల్ ..ప్రతి ఏడాది ఈ లీగ్ ద్వారా ఎన్నో వేల కోట్ల కాసుల వర్షం కురుస్తుంది..అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఐపీయల్ వాయిదా పడుతూ వస్తుంది..అయితే ఇంతకీ ఇండియాలో కరోనా కేసులు తక్కువ అవ్వకపోవడంతో, ఐపీయల్ ను యూఏఈ కి షిఫ్ట్ చేసారు..సరిగ్గా ఇంకో నెల రోజుల్లో యూఏఈ లో ఐపీయల్ పదమూడవ సీజన్ ప్రారంభం అవుతుంది..

ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు గురువారం ఉదయం దుబాయ్‌కు బయలుదేరగా.. మిగతా జట్లు కూడా త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాయి. అయితే కొద్ది రోజులుగా యూఏఈలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ గడిచిన 24 గంటల్లో 365 కొత్త కేసలు నమోదవడం కొంత ఆందోళన కలిగిస్తుంది..

ఐపీఎల్‌ ప్రారంభానికి ఇంకా నెలరోజులే మిగిలి ఉన్న ఈ సమయంలో ఆ దేశంలో కరోనా కేసులు పెరగడం కొంచెం ఇబ్బందిగా మారింది. ఒకవేళ కేసులు అనూహ్యంగా పెరిగితే ఐపీఎల్‌ పరిస్థితి ఏంటని కొన్ని వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కాగా ఇప్పటివరకు యూఏఈలో 64,906 కేసులు నమోదు కాగా.. 366 మరణాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్న మ్యాచ్‌లు బయో సెక్యూర్‌ పద్దతిలో నిర్వహించనున్నారు.

అంతేగాక లీగ్‌లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికి కఠిన నిబంధనలు వర్తింపజేయనున్నారు. ప్రతీ ఆటగాడికి రెండు సార్లు కరోనా టెస్టులు అయ్యాకే అనుమతించనున్నారు. కోవిడ్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వస‍్తేనే విమానం ఎక్కేందుకు పర్మిషన్‌ ఇవ్వనున్నారు. మ్యాచ్ గెలిచినా.. ఓడినా.. ఆటగాళ్ల మధ్య ఎలాంటి షేక్‌ హ్యాండ్స్‌కు తావులేదు. కాగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ నవంబర్‌ 10 వరకు జరగనుంది

Tags :
|
|
|
|

Advertisement