Advertisement

  • ఐపీయల్ నిర్వహిస్తా అంటూ ముందుకు వచ్చిన మరొక దేశం

ఐపీయల్ నిర్వహిస్తా అంటూ ముందుకు వచ్చిన మరొక దేశం

By: Sankar Sun, 07 June 2020 1:05 PM

ఐపీయల్ నిర్వహిస్తా అంటూ ముందుకు వచ్చిన మరొక దేశం

భారత క్రికెట్ లో ఐపీయల్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది ..ఎందరో యువ ఆటగాళ్లు ఐపీయల్ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు...అయితే కరోనా కారణంగా ఈ సీజన్ ఐపీయల్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు..ఏప్రిల్ 15కి ఈ టోర్నీని తొలుత వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువులోపు దేశంలో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరు చూస్తుంటే ఇప్పట్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఆతిథ్యం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. భారత్‌లో టోర్నీని నిర్వహిస్తే..? విదేశీ క్రికెటర్లని ఇక్కడికి అనుమతిస్తారా..? టోర్నీలోని 8 టీమ్‌లు మ్యాచ్‌ల కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ తొలి వాయికి ముందే.. తమ రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిచొద్దంటూ ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విషయం తెలిసిందే.

భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సూచనలు కనిపించకపోవడంతో.. ఆ టోర్నీకి తాము ఆతిథ్యమిస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఆ ఏడాది ఐపీఎల్ జరగగా.. 2014లోనూ యూఏఈ వేదికగా ఫస్ట్ హాఫ్ సీజన్ మ్యాచ్‌లు జరిగాయి. దాంతో ఆ ఆతిథ్య అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ఐపీఎల్ 2020 సీజన్‌ అవకాశం తమకి ఇవ్వాలని యూఏఈ బోర్డు కోరింది. కానీ.. భారత్ వెలుపల ఐపీఎల్ 2020 మ్యాచ్‌లు తమ చివరి ఆప్షన్ అని ఇటీవల చెప్పుకొచ్చిన బీసీసీఐ పెద్దలు.. టీ20 వరల్డ్‌కప్ వాయిదా నిర్ణయం వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుంది.



Tags :
|
|
|

Advertisement